హోమ్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచి క్రెడిట్ ప్రొఫైల్స్ కలిగి ఉన్న దరఖాస్తుదారులకు ఆకర్షణీయమైన హోమ్ లోన్ నిబంధనలు మరియు ప్రయోజనాలను అందిస్తుంది. అటువంటి నిబంధనలకు అర్హత పొందడానికి, దరఖాస్తుదారులకు సాధారణంగా 750+ సిబిల్ స్కోర్ ఉండాలి.
హోమ్ లోన్ ఇఎంఐ మొత్తం మూడు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది:
-
హోమ్ లోన్ అసలు మొత్తం: ఇది హోమ్ లోన్ శాంక్షన్ మొత్తం మరియు మీ హోమ్ లోన్ ఇఎంఐపై నేరుగా ప్రభావం చూపుతుంది. మీ హోమ్ లోన్ మొత్తం ఎంత ఎక్కువగా ఉంటే, మీ హోమ్ లోన్ ఇఎంఐ అంత ఎక్కువగా ఉంటుంది.
-
హోమ్ లోన్ వడ్డీ రేటు: హోమ్ లోన్ వడ్డీ రేటు అనేది మీరు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన రేటు. సహజంగా, అధిక వడ్డీ రేటు ఒక పెద్ద ఇఎంఐ మొత్తానికి దారితీస్తుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలు తమ వడ్డీ రేటును రెపో రేటుకు లింక్ చేసుకునే అవకాశాన్ని కూడా అనుమతిస్తుంది.
-
హోమ్ లోన్ రీపేమెంట్ అవధి: రీపేమెంట్ అవధి అనేది మీ హోమ్ లోన్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడానికి మీరు తీసుకోగల మొత్తం సమయం. దీర్ఘకాలిక అవధి చిన్న ఇఎంఐలను సులభతరం చేయవచ్చు కానీ మీ అప్పు తీసుకునే మొత్తం ఖర్చుకు జోడించవచ్చు.
మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ ఇఎంఐ మొత్తాన్ని ముందస్తుగా లెక్కించేందుకు మీరు హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
అవును, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ రుణగ్రహీతలకు షెడ్యూల్ కంటే ముందు లోన్ తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది. అలా చేయడాన్ని పరిగణించగల రెండు మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- పార్ట్-ప్రీపేమెంట్: మీ హోమ్ లోన్‌పై పార్ట్-ప్రీపేమెంట్లు చేయడం ద్వారా, మీరు మీ సాధారణ ఇఎంఐ చెల్లింపులపై ఏకమొత్తంలో చెల్లింపులు చేయవచ్చు మరియు మీ రీపేమెంట్ షెడ్యూల్ కంటే ముందుగానే మీ రీపేమెంట్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
- ఫోర్‍క్లోజర్: మీ హోమ్ లోన్‌ను ఫోర్‍క్లోజ్ చేయడం ద్వారా, మీరు మీ రీపేమెంట్ అవధి ముగిసే ముందు పూర్తి బాకీ మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లిస్తారు.
అవును, మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరూ మీ హోమ్ లోన్ కోసం జాయింట్ ఫైనాన్షియల్ దరఖాస్తుదారులు కావచ్చు. ఒక జాయింట్ హోమ్ లోన్ కోసం అప్లై చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వీటిలో కొన్ని ఇవి:
- పెరిగిన హోమ్ లోన్ అర్హత
- ఆదాయ పన్ను సేవింగ్స్
- సులభంగా పెరిగిన హోమ్ లోన్ రీపేమెంట్
ఒక ఆర్థిక సహ-దరఖాస్తుదారును కలిగి ఉండటం సాధారణంగా హోమ్ లోన్ అప్లికేషన్లకు సహాయపడుతుంది ఎందుకంటే ఇది మీ రుణం అర్హత మరియు రీపేమెంట్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అర్హత ప్రమాణాలను నెరవేర్చడంలో విఫలమయ్యే దరఖాస్తుదారులు వారి హోమ్ లోన్ అప్లికేషన్‌ను మెరుగుపరచడానికి ఒక ఆర్థిక సహ-దరఖాస్తుదారుతో అప్లై చేసుకోవచ్చు.
రుణగ్రహీతలు తమ అర్హత ఆధారంగా 32 సంవత్సరాల వరకు విస్తరించగల రీపేమెంట్ అవధితో తమకు నచ్చినట్టు తమ హోమ్ లోన్లను తిరిగి చెల్లించడానికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనుమతిస్తుంది.
మా అర్హతా ప్రమాణాలను నెరవేర్చే జీతం పొందేవారు, ప్రొఫెషనల్ మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులు మా వద్ద ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారుల కోసం అర్హతా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
జీతం పొందే వ్యక్తులు | స్వయం-ఉపాధి గల వ్యక్తులు |
---|---|
దరఖాస్తుదారు కనీసం 3 సంవత్సరాల పని అనుభవంతో ఒక పబ్లిక్ లేదా ప్రైవేట్ కంపెనీ లేదా మల్టీనేషనల్ నుండి జీతం పొందే ఆదాయం యొక్క స్థిరమైన వనరుతో ఉద్యోగం చేస్తూ ఉండాలి | దరఖాస్తుదారు ప్రస్తుత సంస్థలో 3 సంవత్సరాలకు పైగా వ్యాపార కొనసాగింపుతో స్వయం-ఉపాధి పొందేవారు అయి ఉండాలి |
అతను/ఆమె భారతీయ నివాసి లేదా ఎన్ఆర్ఐ అయి ఉండాలి | అతను/ఆమె భారతీయ పౌరులు అయి ఉండాలి (నివాసి మాత్రమే) |
అతను/ఆమె భారతీయ పౌరులు అయి ఉండాలి | అతను/ఆమె భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అయి ఉండాలి |
టాప్-అప్ రుణం అనేది అర్హతా ప్రమాణాలను నెరవేర్చే హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ దరఖాస్తుదారులకు సాధారణంగా అందుబాటులో ఉన్న ఒక రీఫైనాన్సింగ్ ఎంపిక. రుణగ్రహీత బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం పొందినప్పుడు, వారు ఇంటి పునరుద్ధరణ వంటి ఇంటి ఖర్చుల కోసం రూ. 1 కోటి* లేదా అంతకంటే ఎక్కువ అదనపు ఫండ్స్ కూడా పొందవచ్చు.
కాబోయే హోమ్ లోన్ దరఖాస్తుదారులు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మరియు వేగవంతమైన లోన్ అప్రూవల్ అవకాశాలను ఆప్టిమైజ్ చేయడానికి తమ లోన్ అర్హతను తనిఖీ చేసుకోవడానికి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు. క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
-
డ్రాప్-డౌన్ మెనూ నుండి మీరు మీ ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్న నగరాన్ని ఎంచుకోండి.
-
మీ పుట్టిన తేదీని నమోదు చేయండి.
-
మీ నెలవారీ ఆదాయాన్ని ప్రకటించడానికి స్లైడర్‌ను ఉపయోగించండి.
-
మీ నెలవారీ బాధ్యతలను ప్రకటించడానికి తదుపరి స్లైడర్‌ను ఉపయోగించండి.
అప్పుడు క్యాలిక్యులేటర్ విండో మీకు అర్హత ఉన్న హోమ్ లోన్ మొత్తాన్ని చూపుతుంది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడం అనేది సులభంగా నావిగేట్ చేయగలిగే మరియు అవాంతరాలు-లేని ఒక వేగవంతమైన ప్రాసెస్. మీ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి:
-
హౌసింగ్ లోన్ అప్లికేషన్ ఫారంకు నావిగేట్ చేయండి.
-
మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఉపాధి రకం మరియు నివాస మరియు ఆర్థిక సమాచారం వంటి మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయండి.
-
మీకు అవసరమైన హోమ్ లోన్ రకాన్ని ఎంచుకోండి – హోమ్ లోన్ లేదా హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్.
-
ఓటిపి జనరేట్ చేయండి మరియు తదుపరి దశకు వెళ్ళడానికి దానిని నమోదు చేయండి.
-
అభ్యర్థించిన విధంగా అన్ని ఆర్థిక వివరాలను నమోదు చేయండి మరియు ఫారంను పూర్తి చేయండి. గమనిక: మీరు నింపవలసిన ఫీల్డ్‌లు మీ ఉపాధి రకం ఆధారంగా మారవచ్చు.
-
అప్లికేషన్ సబ్‌మిట్ చేయండి.
మా కస్టమర్ ప్రతినిధి త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
సంబంధిత ఆర్టికల్స్
మీ హోమ్ లోన్ ఇఎంఐను ఎలా లెక్కించాలి
342 3 నిమిషాలు
ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎలా పనిచేస్తుంది
483 3 నిమిషాలు
భారతదేశంలో అందుబాటులో ఉన్న లోన్ల రకాలు
378 4 నిమిషాలు
పోటీ హోమ్ లోన్ వడ్డీ రేటును పొందడానికి చిట్కాలు
422 5 నిమిషాలు